A A A A A

గణిత సంకేతాలు: [సంఖ్య ౫]


ప్రకటన ౧౩:౫-౧౮
[౫] గర్వంగా మాట్లాడటానికి, దైవ దూషణ చేయటానికి, తన అధికారాన్ని నలుబది రెండు నెలలు చెలాయించడానికి ఆ మృగానికి నోరు యివ్వబడింది.[౬] ఆ మృగం తన నోరు తెరచి దేవుణ్ణి దూషించింది. ఆయన నామాన్ని, ఆయన నివసించే స్థానాన్ని, పరలోకంలో నివసించే వాళ్ళను దూషణ చేసింది.[౭] భక్తులతో యుద్ధం చేసి జయించటానికి దానికి శక్తి యివ్వబడింది. అంతేకాక, అన్ని జాతుల మీద, అన్ని గుంపుల మీద, అన్ని భాషల మీద, అన్ని దేశాల మీద ఆ మృగానికి అధికారమివ్వబడింది.[౮] ఈ భూమ్మీద నివసించే వాళ్ళంతా, అంటే ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి ఎవరి పేర్లు వధింపబడిన గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడలేదో, వాళ్ళు ఈ మృగాన్ని పూజిస్తారు.[౯] చెవులున్న వాళ్ళు వినండి:[౧౦] బంధింపబడవలసిన వాడు బంధింపబడతాడు. కత్తితో వధింపబడవలసిన వాడు వధింపబడతాడు. కనుక భక్తుల్లో శాంతము, విశ్వాసము ఉండాల్సి వస్తుంది.[౧౧] తదుపరి మరొక మృగం భూమిలోపలి నుండి రావటం చూసాను. ఆ మృగానికి గొఱ్ఱెకు ఉన్నట్లు రెండు కొమ్ములు ఉన్నాయి. కాని అది ఘటసర్పం మాట్లాడినట్లు మాట్లాడింది.[౧౨] అది ప్రమాదకరమైన గాయం నయమైన మొదటి మృగం పక్షాన, దాని అధికారమంతా ఉపయోగించి భూమిని, దానిపై నివసించే వాళ్ళను, మొదటి మృగాన్ని పూజించేటట్లు చేసింది.[౧౩] అది అద్భుతమైన సూచనలు చూపింది. ప్రజలు చూస్తుండగా ఆకాశం నుండి మంటల్ని కూడా భూమ్మీదికి రప్పించింది.[౧౪] మొదటి మృగం పక్షాన సూచనలు చూపటానికి దానికి అధికారమివ్వబడింది. ఈ అధికారంతో అది భూమ్మీద నివసించే వాళ్ళను మోసం చేస్తోంది. కత్తితో గాయపడి కూడా జీవించిన మృగానికి గౌరవార్థంగా ఒక విగ్రహాన్ని స్థాపించమని ప్రజల్ని ఆజ్ఞాపించింది.[౧౫] మొదటి మృగం యొక్క విగ్రహానికి ప్రాణం పోసే శక్తి యివ్వబడింది. ఆ విగ్రహం మాట్లాడి, తనను పూజించటానికి నిరాకరించిన వాళ్ళను చంపేటట్లు చేసింది.[౧౬] అంతేకాక చిన్నా, పెద్దా, ధనికుడూ, పేదవాడు, బానిస, స్వతంత్రుడు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కడూ తన కుడి చేతి మీదగాని, నుదుటిమీదగాని, ఒక ముద్ర వేసుకోవాలని నిర్భంధం చేసింది.[౧౭] ఈ ముద్ర లేకుండా ఎవ్వరూ అమ్మటం కాని, కొనటం కాని, చేయరాదని యిలా చేసింది. ఈ ముద్రలలో ఆ మృగం పేరు, లేక వాని పేరు సంఖ్య వ్రాయబడి ఉంది.[౧౮] ఇక్కడే తెలివి కావాలి. ఆ పరిజ్ఞానం ఉన్నవాడు ఆ మృగం యొక్క సంఖ్య ఏదో చెప్పనీ! ఎందుకంటే అది ఒక మనుష్యుని సంఖ్య. వాని సంఖ్య ఆరువందల అరువదియారు.

మాథ్యూ ౧౯:౯
కాని నేను చెప్పేదేమిటంటే అవినీతిపరురాలు కాని తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడువబడ్డ దానిని పెండ్లి చేసికొంటే వాడును వ్యభిచారిగా అవుతాడు” అని అన్నాడు.

ప్రకటన ౧౧:౨-౩
[౨] కాని వెలుపలి ఆవర్ణం, యూదులుకాని వాళ్ళకివ్వబడింది. కనుక దాన్ని కొలత వేయకుండా వదిలేయి. వాళ్ళు నలభైరెండు నెలలు దాకా ఈ పవిత్ర నగరాన్ని త్రొక్కుతూ నడుస్తారు.[౩] నేను నా యిరువురి సాక్షులకు శక్తినిస్తాను. వాళ్ళు గోనె పట్ట కట్టుకొని పన్నెండువందల అరువది దినాల దాకా దైవ సందేశం చెబుతారు.

మాథ్యూ ౫:౩౨
కాని నేను చెప్పేదేమంటే భార్య మీద వ్యభిచార కారణంలేకుండా భర్త ఆమెకు విడాకులిస్తే ఆమె వ్యభిచారిణిగా పరిగణింపబడటానికి అతడు కారకుడౌతాడు. అలా విడాకులు పొందిన స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. వ్యభిచార కారణాన మాత్రానే తన భార్యకు విడాకులివ్వాలి గాని వేరే కారణాన కాదు.

౨ తిమోతి ౩:౧౬
లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపింపబడినవి. నీతిని బోధించటానికి, గద్దించటానికి, సరిదిద్దటానికి, నీతి విషయం తర్ఫీదు చేయటానికి, ఉపయోగపడతాయి.

ప్రకటన ౪:౬-౮
[౬] గాజుతో కప్పిన సముద్రంలా కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు కనిపించింది. అది స్ఫటికంలా నిర్మలంగా ఉంది. సింహాసనం మధ్య, చుట్టూ, అంటే ముందు, వెనుకా, నాలుగు ప్రాణులు ఉన్నాయి. వాటి దేహాలు ముందు, వెనుకా, కళ్ళతో కప్పబడి ఉన్నాయి.[౭] మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే పెద్దపక్షిలా ఉన్నాయి.[౮] ప్రతీ ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి శరీరాలుపైన, క్రిందా కళ్ళతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. రెక్కల క్రింద కళ్ళతో కప్పబడి ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక: “భూత, భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడును ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” అని పాడుతూ ఉన్నాయి.

సంఖ్యలు ౫:౧౧-౩౧
[౧౧] అప్పుడు మోషేతో యోహోవా ఈలాగున చెప్పాడు:[౧౨] “ఇశ్రేయేలు ప్రజలతో ఈ విషయాలు చెప్పు: ఒకని భార్య అతనికి అపనమ్మకంగా ఉంటుంది.[౧౩] ఆమె మరొకనితో శయనించి, తన భర్తకు తెలియకుండా ఈ విషయం దాచిపెడుతుంది. ఆమె చేసిన తప్పునుగూర్చి ఆమె భర్తకు ఎప్పటికి తెలియకపోవచ్చు. ఆమె ఆ పాపం చేసిందని అతనితో చెప్పే వారు ఎవరూ ఉండక పోవచ్చు. మరియు ఆ స్త్రీ తన పాపం విషయం తన భర్తకు చెప్పకపోవచ్చు.[౧౪] కానీ, తన భార్య తనకు వ్యతిరేకంగా పాపం చేసిందని ఆ భర్త అనుమానించటం ప్రారంభం కావచ్చు. అతనిలో కోపం కలుగుతూ వుండవచ్చు. ఆమె పవిత్రంగా లేదని, తనకు నమ్మకంగా లేదని అతనిలో అనుమానం ఏర్పడుతూ ఉండవచ్చు.[౧౫] అలా జరిగితే, అతడు తన భార్యను యాజకుని దగ్గరకు తీసుకునిపోవాలి. ఆ భర్త ఒక అర్పణకూడ తీసుకొని వెళ్లాలి. ఆ అర్పణ తూమెడు యవలపిండిలో పదోవంతు. యవలపిండిలో నూనెగాని సాంబ్రాణిగాని వేయకూడదు. ఈ యవల పిండి యెహోవాకు ధాన్యార్పణ. భర్త రోషం మూలంగా అది అర్పించబడింది. అతని భార్య అతనికి అపనమ్మకంగా ఉందని అతడు నమ్ముతున్నట్టు ఈ అర్పణ సూచిస్తుంది.[౧౬] “యాజకుడు ఆ స్త్రీని యెహోవా ఎదుట నిలువబెడ్తాడు.[౧౭] అప్పుడు యాజకుడు మట్టి పాత్రలో పవిత్ర జలం పోస్తాడు. పవిత్ర గుడాకంలోని నేల మీద మట్టి కొంత తీసుకుని, దానిని ఆ నీళ్లలో వేస్తాడు యాడకుడు.[౧౮] ఆ స్త్రీని యెహోవా ఎదుట నిలచివుండమని యాజకుడు ఆమెను బలవంతం చేస్తాడు. అప్పుడతడు ఆమె తల వెంట్రుకలను వదులుగా విడిచి, ధాన్యార్పణను ఆమె చేతిలో పెడతాడు. ఇది తన భర్త రోషం విషయం అర్పించే యవల పిండి. అదే సమయంలో పవిత్ర జలం ఉన్న మట్టి పాత్రను అతడు పట్టుకొంటాడు. ఇది ఆ స్త్రీకి చిక్కుతెచ్చిపెట్టే పవిత్ర జలం.[౧౯] “అప్పుడు అబద్ధం చెప్పకూడదని యాజకుడు ఆ స్త్రీతో చెబుతాడు. సత్యం చెబుతానని ఆమె వాగ్ధానం చేయాలి. యాజకుడు ఆమెతో ఇలా అంటాడు, ‘నీవు ఇంకో మగవాడితో శయనించి ఉండకపోతే, నీ భర్తను పెళ్లాడిన నీవు, అతనికి వ్యతిరేకంగా పాపం చేసి ఉండకపోతే, కష్టం కలిగించే ఆ జలం నీకు హాని చేయదు.[౨౦] కానీ నీవు నీ భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, నీవు మరో మగవాడితో శయనించి ఉంటే నీకు ఏదో కీడు జరుగుతుంది. నీవు పవిత్రురాలివి కాదు. ఎందు చేతనంటే నీ భర్తకాని వాడైన పర పురుషుడు నీతో శయనించి నిన్ను అపవిత్రం చేసాడు.[౨౧] కనుక నీవు ప్రత్యేక జలం తాగినప్పుడు నీకు గొప్ప కీడు సంభవిస్తుంది. నీ కడుపు ఉబ్బిపోతుంది, ఇంక నీకు పిల్లలు పుట్టరు. నీవు గర్భవతివి అయితే నీ శిశువు చనిపోతుంది. అప్పుడు నీ వాళ్లంతా నిన్ను విడిచిపెట్టేసి, నిన్నుగూర్చి చెడుదా చెప్పుకొంటారు.’ “ఆ స్త్రీ యెహోవాకు ప్రత్యేక ప్రమాణం చేయాలని యాజకుడు ఆమెతో చెప్పాలి. ఆ స్త్రీ అబద్ధం గనుక చెబితే ఈ కీడు తనకు జరుగుతుందని ఒప్పుకోవాలి.[౨౨] “నీ శరీరంలో హాని కలిగించే ఈ నీళ్లు నీవు తాగాలి. నీవు పాపం చేసి ఉంటే నీకు పిల్లలు పుట్టరు, నీకు కలిగే ఏ శిశువైనా సరే పుట్టక ముందే చనిపోతుంది’ అని యాజకుడు చెప్పాలి. అప్పుడు ఆ స్త్రీ ‘నీవు చెప్పినట్టు చేయటానికి నేను ఒప్పుకుంటున్నాను’ అని చెప్పాలి.[౨౩] “యాజకుడు ఈ హెచ్చరికలను ఒక పత్రంమీద వ్రాయాలి. అప్పుడు అతడు ఆ మాటలను నీళ్లలోనికి తుడిచివేయాలి.[౨౪] అప్పుడు హాని కలిగించే ఆ నీళ్లను ఆ స్త్రీ తాగుతుంది. ఆ నీళ్లు ఆమెలో ప్రవేశించి, ఆమె దోషి అయితే, ఆమెకు చాల శ్రమ కలిగిస్తాయి.[౨౫] “అప్పుడు యాజకుడు ఆమె దగ్గరనుండి ధాన్యార్పణ తీసుకుని (రోషమునకు అర్పించు అర్పణ) దానిని యెహోవా ఎదుట పైకి ఎత్తుతాడు. తర్వాత బలిపీఠం దగ్గరకు దానిని తెస్తాడు.[౨౬] ఆ తర్వాత యాజకుడు తన చేతినిండా ధాన్యార్పణ పట్టుకొని బలిపీఠం మీద ఉంచుతాడు. అప్పుడు అతడు దానిని దహిస్తాడు. ఆ తర్వాత ఆ నీళ్లు త్రాగమని అతడు ఆ స్త్రీతో చెబుతాడు.[౨౭] ఆ స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం గనుక చేసి ఉంటే, ఆ నీళ్లు ఆమెకు హాని కలిగిస్తాయి. ఆ నీళ్లు ఆమె శరీరంలోనికి పోయి, ఆమెకు చాలా శ్రమ కలిగిస్తాయి. ఆమెలో ఏదైనా శిశువు ఉంటే అది పుట్టక ముందే మరణిస్తుంది, ఆమె ఎన్నటికీ పిల్లలను కనదు. ప్రజలంతా ఆమెకు వ్యతిరేకం అవుతారు.[౨౮] కానీ ఆస్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఉండకపోతే, ఆమె పవిత్రంగా ఉంటే అప్పుడు ఆమె నిర్దోషి అని యాజకుడు చెబుతాడు. అప్పుడు ఆమె మామూలుగా ఉండి పిల్లలను కనగల్గుతుంది.[౨౯] “అందుచేత రోషమునుగూర్చిన ఆజ్ఞ ఇది. తన భర్తతో వివాహం జరిగిన ఒక స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు నీవు చేయాల్సింది ఇది.[౩౦] లేక ఒకడు తన భార్య తనకు వ్యతిరేకంగా పాపం చేసిందని అనుమానించినప్పుడు అతడు చేయాల్సింది ఇది. ఆ స్త్రీని యెహోవా యెదుట నిలువమని యాజకుడు చెప్పాలి. అప్పుడు యాజకుడు ఇవన్నీ చేయాలి. ఇది ఆజ్ఞ.[౩౧] ఇలా చేసినందువల్ల భర్త తప్పు చేసినట్టు కాదు. కానీ ఆ స్త్రీ మాత్రం పాపం చేసి ఉంటే శ్రమ అనుభవిస్తుంది.”

౧ రాజులు ౭:౨౩
పిమ్మట హీరాము కంచుతో ఒక గుండ్రని కోనేరు తయారు చేశాడు. (దానిని వారు “సముద్రం” అని పిలిచారు) ఆ సముద్రం సుమారు నలభై ఐదు అడుగుల చుట్టు కొలత కలిగివుంది. ఒక అంచునుండి మరొక అంచు వరకు సముద్రం అడ్డుగా పదిహేను అడుగులు వుంది. దాని లోతు ఏడున్నర అడుగులు.

ద్వితీయోపదేశకాండము ౬:౪
“ఇశ్రాయేలు ప్రజలారా వినండి: యెహోవా ఒక్కడు మాత్రమే మన దేవుడు.

మలాకీ ౩:౧౦
సర్వశక్తిమంతుడైన యెహోవా అంటున్నాడు, “ఈ పరీక్షలో ప్రయత్నించండి. మీకు ఉన్నవాటిలో పదో భాగం నా దగ్గరకు తీసికొని రండి. వాటిని ధనా గారంలో ఉంచండి. నా మందిరానికి ఆహారం తీసికొనిరండి. నన్ను పరీక్షించండి! మీరు ఆ పనులు చేస్తే, అప్పుడు నేను నిజంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆకాశం నుండి వర్షం కురిసినట్టు, మంచి మంచి విషయాలు మీకు లభిస్తాయి. మీకు సమస్తం, కావలసిన దానికంటె ఎక్కువగా ఉంటాయి.

కీర్తనలు ౧౦౪:౯
సముద్రానికి నీవు హద్దులు నియమించావు. నీళ్లు భూమిని కప్పివేసేట్టుగా మరల ఎన్నటికీ ఉప్పొంగవు.

ఆదికాండము ౬:౧౨
[This verse may not be a part of this translation]

ఆదికాండము ౭:౨౦
పర్వత శిఖరాలకు పైగా నీటిమట్టం లేస్తూనే ఉంది. అన్నింటికంటే ఎత్తయిన పర్వత శిఖరానికి ఇంకా 20 అడుగులు ఎత్తుగానే నీటిమట్టం ఉంది.

ఆదికాండము ౮:౫-౯
[౫] నీళ్లు ఇంకిపోతూనే ఉన్నాయి, పదవ నెల మొదటి రోజుకు కొండ శిఖరాలు నీళ్లకు పైగా కనబడ్డాయి.[౬] నలభై రోజుల తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తెరిచాడు.[౭] ఒక కాకిని నోవహు బయటకు పంపాడు. నీళ్లన్నీ ఇంకి పోయి, నేల ఆరిపోయేంత వరకు ఒక చోటునుండి మరో చోటుకు ఆ కాకి ఎగురుతూనే ఉంది.[౮] ఒక పావురాన్ని కూడా నోవహు పంపించాడు. ఆరిన నేలను పావురం తెల్సుకోవాలను కొన్నాడు నోవహు. అతడు నేల ఇంకా నీళ్లతో నిండి ఉందేమో తెల్సుకోవాలను కొన్నాడు.[౯] నేలమీద ఇంకా నీళ్లు నిండి ఉండటం చేత పావురం తిరిగి ఓడలోకి వచ్చేసింది. నోవహు చేయి బయటకు చాచి పావురాన్ని పట్టుకున్నాడు. ఆ పావురాన్ని నోవహు మళ్లీ ఓడలోకి తెచ్చాడు.

ఆదికాండము ౯:౧౧
ఇదే నీకు నా వాగ్దానం. వరద నీటిచేత, భూమిమీద సకల ప్రాణులు నాశనం చేయబడ్డాయి. అయితే ఇక ఎన్నటికీ మరల అలా జరుగదు. భూమిమీద సకల ప్రాణులను ఒక వరద మాత్రం ఇక ఎన్నటికీ తిరిగి నాశనం చేయదు.”

ఆదికాండము ౧:౩౧
దేవుడు తాను చేసినది అంతా చూశాడు. అది అంతా చాలా చక్కగా ఉన్నట్టు దేవునికి కనబడింది. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఆరవ రోజు.

ఆదికాండము ౩:౧౫
ఈ స్త్రీని, నిన్ను ఒకరికొకర్ని విరోధుల్నిగా నేను చేస్తాను. నీ సంతానము, ఆమె సంతానము ఒకరికొకరు విరోధులవుతారు. నీవు ఆమె శిశువు పాదం మీద కాటేస్తావు ఈ శిశువు నీ తలను చతుక కొడతాడు.”

౧ కోరింతియన్స్ ౧౦:౧౩
మానవులకు సహజంగా సంభవించే పరీక్షలు తప్ప మీకు వేరే పరీక్షలు కలుగలేదు. దేవుడు నమ్మకస్తుడు. భరించగల పరీక్షలకన్నా, పెద్ద పరీక్షలు మీకు ఆయన కలుగనీయడు. అంతేకాక, పరీక్షా సమయం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని జయం పొందే మార్గం కూడా దేవుడు చూపుతాడు.

ఎక్సోడస్ ౨౦:౧౩
“నీవు ఎవ్వరినీ హత్య చేయకూడదు.”

Telugu Bible WBTC
Copyright WBTC