A A A A A

లైఫ్: [మెడిసిన్]


౧ పేతురు ౩:౩-౪
[౩] జడ వేసి, బంగారు నగలు ధరించి, విలువైన దుస్తుల్ని కట్టుకొని శరీరాన్ని బాహ్యంగా అలంకరించటంకన్నా[౪] మీ అంతరాత్మను, సాత్వికత, శాంతత అనే నశించని గుణాలతో అలంకరించుకోండి. దేవుడు యిలాంటి అలంకరణకు ఎంతో విలువనిస్తాడు.

౨ కోరింతియన్స్ 4:16
కనుక మేము అధైర్యపడము. భౌతికంగా మేము క్షీణించిపోతున్నా, మా ఆంతర్యం ప్రతి రోజూ శక్తి పొందుతూ ఉంది.

ఎఫెసీయులకు ౨:౧౦
దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు.

ఆదికాండము ౧:౨౭
కనుక దేవుడు తన స్వంత రూపంలో మనుష్యుల్ని చేశాడు. తన ప్రతిరూపంలో దేవుడు మనుష్యుల్ని చేశాడు. దేవుడు వారిని మగ, ఆడ వారిగా చేశాడు.

యెషయా ౪౦:౮
గడ్డి చచ్చిపోయి ఎండిపోతుంది. కానీ మన దేవుని మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.”

ఫిలిప్పీయులకు ౪:౮
కనుక సోదరులారా! నేను చివరకు చెప్పేదేమిటంటే, సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైన వాటిని, పవిత్రమైన వాటిని, ఆనందమైన వాటిని, మెచ్చుకోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్న వాటిని గురించి, ప్రశాంతమైన వాటిని గురించి మీ మనస్సులో ఆలోచించండి.

కీర్తనలు ౧౩౯:౧౪
యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను. నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.

రోమన్లు ౮:౬
ప్రాపంచిక విషయాలకు లోనవటం వల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటం వల్ల జీవం. శాంతం లభిస్తాయి.

సాంగ్ అఫ్ సోలోమోన్ ౪:౭
నా ప్రియురాలా! నీ శరీరమంతా అందంగానే ఉంది. నీకెక్కడా వికారమైన గుర్తుల్లేవు!

మాథ్యూ 6:28-29
[28] “మీరు దుస్తుల్ని గురించి ఎందుకు చింతిస్తున్నారు? గడ్డిమీద పెరిగే పువ్వుల్ని గమనించండి. అవి పని చేసి దారాన్ని వడకవు.[29] అయినా, నేను చెప్పేదేమిటంటే గొప్ప వైభవమున్న సొలొమోను రాజుకూడా అలంకరణలో ఈ పువ్వుల్లోని ఒక్క పువ్వుతో కూడా సరితూగలేడు.

౧ తిమోతి ౨:౯-౧౦
[౯] స్త్రీలు గౌరవం కలిగించే దుస్తులు ధరించి వినయంగా, మర్యాదగా ఉండాలి. బంగారు నగలు, ముత్యాలు, ఖరీదైన దుస్తులు, తలవెంట్రుకలతో నానా విధపు ముడులు వేయటం. ఇవి మీకు అలంకారముగా అనుకొనక,[౧౦] దైవభక్తులమని చెప్పుకొనుటకు తగినట్లుగా సత్కార్యములనే ఆభరణాలను అలంకారంగా ధరించాలి.

౧ సమూయేలు ౧౬:౭
అయితే యెహోవా, “ఏలీయాబు ఎంతో అందంగా ఎత్తుగా ఉన్నాడు. కానీ ఆ విషయాలు లక్ష్యపెట్టకు. మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేదు. ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు కానీ యెహోవా హృదయం చూస్తాడు. ఏలీయాబు తగిన వాడు కాడు” అని తెలియజేసాడు.

ప్రసంగి ౩:౧౧
తన జగత్తును గురించి ఆలోచించే సామర్థ్యాన్ని దేవుడు మనకి యిచ్చాడు. అయితే దేవుడు చేసే వాటన్నింటినీ మనం ఎన్నడూ పూర్తిగా తెలుసు కోలేము. అయితేనేమి, దేవుడు అన్ని పనుల్నీ సరిగ్గా సరైన సమయంలోనే చేస్తాడు.

గలతీయులకు ౩:౨౬-౨౭
[౨౬] యేసుక్రీస్తులో మీకు విశ్వాసం వుండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు.[౨౭] ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు.

సామెతలు ౩:౧౫-౧౮
[౧౫] జ్ఞానము నగల కంటే ఎంతో ఎక్కువ విలువ గలది. నీవు కోరుకో దగినది ఏదీ జ్ఞానము అంతటి విలువ గలది కాదు![౧౬] జ్ఞానము సుదీర్గ జీవితాన్ని, ఐశ్వర్యాలు, ఘనతలను నీకు ఇస్తుంది.[౧౭] జ్ఞానముగల మనుష్యులు శాంతి, సంతోషం, కలిగి జీవిస్తారు.[౧౮] జ్ఞానము జీవవృక్షంలా ఉంటుంది. దానిని స్వీకరించే వారికి అది నిండు జీవితాన్ని ఇస్తుంది. జ్ఞానమును కలిగినవారు నిజంగా సంతోషంగా ఉంటారు.

యెహెజ్కేలు ౨౮:౧౭-౧౮
[౧౭] “‘నీ అందాన్ని చూచుకొని నీవు గర్వపడ్డావు. నీ గొప్పతనం యెక్క గర్వం నీ జ్ఞానాన్ని పాడు చేసింది. అందువల్ల నిన్ను కిందికి పడదోశాను. ఇప్పుడు ఇతర రాజులు నీవంక తేరిపార జూస్తున్నారు.[౧౮] నీవు చాలా పాపాలు చేశావు. నీవు చాలా కుటిలమైన వర్తకుడవు. ఈ రకంగా పవిత్ర స్థలాలను నీవు అపవిత్ర పర్చావు. కావున నీలో నేను అగ్ని పుట్టించాను. అది నిన్ను దహించి వేసింది! నీవు నేలమీద బూడిదవయ్యావు. ఇప్పుడు ప్రతి ఒక్కడు నీ అవమానాన్ని చూడ గలడు.

జేమ్స్ ౧:౨౩
[This verse may not be a part of this translation]

మాథ్యూ ౨౩:౨౮
అదే విధంగా మీరు బాహ్యంగా నీతిమంతుల వలె కన్పిస్తారు. కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి.

సామెతలు 31:30
సౌందర్యము, అందము నిన్ను మోసగించవచ్చు. అయితే యెహోవాను గౌరవించే స్త్రీ పొగడబడాలి.

Telugu Bible WBTC
Copyright WBTC