A A A A A

లైఫ్: [పుట్టినరోజు]


ఎఫెసీయులకు ౨:౧౦
దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు.

యిర్మీయా ౨౯:౧౧
ఇది నేనెందుకు చెపుతున్నానంటే మీ అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు.” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం “మీ సంక్షేమం కొరకు నాకు ఎన్నోమంచి ఆలోచనలున్నాయి. మీకు కీడు చేయాలని నేనెన్నడూ ఆలోచించను. మీకు ఆశను, మంచి భవిష్యత్తును కలుగజేయ టానికి వ్యూహరచన చేస్తాను.

జాన్ ౧౬:౨౧
‘ప్రసవించే సమయం వచ్చినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీ నొప్పులు అనుభవిస్తుంది. శిశువు పుట్టాక ఒక జీవిని ఈ ప్రపంచంలోకి తెచ్చిన ఆనందంలో తన వేదన మరచి పోతుంది.’

సామెతలు ౯:౧౧
నీకు జ్ఞానము ఉంటే అప్పుడు నీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది.

కీర్తనలు ౧౬:౧౧
సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు. యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది. నీ కుడిపక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.

కీర్తనలు ౨౦:౪
నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక. నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.

కీర్తనలు ౨౭:౪-౭
[౪] యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది. నేను అడిగేది ఇదే: “నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట. ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట. యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”[౫] నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు. ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు. ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.[౬] నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కానీ ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు. అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను. యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.[౭] యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము. నా మీద దయ చుపించుము.

కీర్తనలు ౯౦:౧౨
మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.

కీర్తనలు ౯౧:౧౧
ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.

కీర్తనలు ౯౧:౧౬
నా అనుచరులకు నేను దీర్గాయుష్షు యిస్తాను. నేను వాళ్లను రక్షిస్తాను.”

కీర్తనలు ౧౧౮:౨౪
ఈ వేళ యెహోవా చేసిన రోజు. ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!

జెఫన్యా ౩:౧౭
నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన శక్తిమంతుడైన సైనికునిలా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఆయన నీకు చూపిస్తాడు. ఆయన నీ గురించి సంతోషపడతాడు, నీవంటే ఆనందిస్తాడు. విందులో పాల్గొన్న వారివలె అయన నీ విషయంలో నవ్వుతూ సంతోషిస్తాడు.

కీర్తనలు ౩౭:౪-౫
[౪] యెహోవాను సేవించటంలో ఆనందించుము. ఆయన నీకు కావల్సిన వాటినియిస్తాడు.[౫] యెహోవా మీద ఆధారపడుము ఆయనను నమ్ముకొనుము. జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.

విలాపవాక్యములు ౩:౨౨-౨౩
[౨౨] యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి. యెహోవా కృపా కటాక్షాలు తరగనివి.[౨౩] అవి నిత్య నూతనాలు. ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.

సంఖ్యలు ౬:౨౪-౨౬
[౨౪] యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక.[౨౫] యెహోవా తన ముఖకాంతిని నీపై ప్రకాశింప చేయును గాక. ఆయన తన ప్రేమను నీకు కనబర్చును గాక.[౨౬] యెహోవా నిన్ను చూచి, నీకు సమాధానం అనుగ్రహించును గాక.”

కీర్తనలు ౧౩౯:౧-౨౪
[౧] యెహోవా, నీవు నన్ను పరీక్షించావు. నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.[౨] నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు. దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.[౩] యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు. నేను చేసే ప్రతీది నీకు తెలుసు.[౪] యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.[౫] యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు. నీవు నెమ్మదిగా నీ చేయినామీద వేస్తావు.[౬] నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది. గ్రహించటం నాకు కష్టతరం.[౭] నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది. యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను.[౮] నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు. పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు.[౯] యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు. పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు.[౧౦] అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి, ఆ చేతితో నన్ను నడిపిస్తావు.[౧౧] యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే, “పగలు రాత్రిగా మారిపోయింది. తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు[౧౨] కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు. రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది.[౧౩] యెహోవా, నా శరీరమంతటినీ నీవు చేశావు. నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.[౧౪] యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను. నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.[౧౫] నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు నా తల్లి గర్భంలో దాగి ఉండి, నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.[౧౬] యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు. ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.[౧౭] దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం. నీకు ఎంతో తెలుసు.[౧౮] వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి. కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.[౧౯] దేవా, దుర్మార్గులను చంపివేయుము. ఆ హంతకులను నా దగ్గర నుండి తీసివేయుము.[౨౦] ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగతులు చెబుతారు. వారు నీ నామాన్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు.[౨౧] యెహోవా, నిన్ను ద్వేషించే ప్రజలను నేను ద్వేషిస్తాను. నీకు విరోధంగా తిరిగే మనుష్యులను నేను ద్వేషిస్తాను.[౨౨] నేను వారిని పూర్తిగా ద్వేషిస్తాను! నీ శత్రువులు నాకూ శత్రువులే.[౨౩] యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము.[౨౪] చూచి నాలో చెడు తలంపులు ఏమి లేవని తెలుసుకొనుము. శాశ్వతంగా ఉండే నీ మార్గంలో నన్ను నడిపించుము.

Telugu Bible WBTC
Copyright WBTC