A A A A A

దేవుడు: [ఆశీర్వాదం]


ల్యూక్ ౬:౩౮
ఇతర్లకు యివ్వండి, మీకివ్వబడుతుంది. అప్పుడు మీకు కొలతలు నింపి, అదిమి, కుదిల్చి ఒలికిపోతుండగా మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో యిస్తే ఆ కొలతతో మీకు లభిస్తుంది.”

మాథ్యూ ౫:౪
దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు కనుక వాళ్ళు ధన్యులు.

ఫిలిప్పీయులకు ౪:౧౯
నా దేవుడు యేసు క్రీస్తులో ఉన్న గొప్ప ఐశ్వర్యంతో మీ అవసరాలన్నీ తీరుస్తాడు.

కీర్తనలు ౬౭:౭
దేవుడు మమ్మల్ని దీవించుగాక. భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.

సంఖ్యలు ౬:౨౪-౨౫
[౨౪] యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక.[౨౫] యెహోవా తన ముఖకాంతిని నీపై ప్రకాశింప చేయును గాక. ఆయన తన ప్రేమను నీకు కనబర్చును గాక.

ఫిలిప్పీయులకు ౪:౬-౭
[౬] ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి. ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞతా హృదయంతో అడగండి.[౭] దేవుడు యిచ్చే శాంతిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అది మీ హృదయాలను, మీ బుద్ధిని, యేసు క్రీస్తులో ఉంచి కాపలాకాస్తుంది.

జేమ్స్ ౧:౧౭
ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్టమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు.

యిర్మీయా ౧౭:౭-౮
[౭] కాని యెహోవాలో నమ్మిక గల వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. ఎందువల్లనంటే తనను నమ్మవచ్చని యెహోవా నిరూపిస్తాడు.[౮] నీటి వనరులున్నచోట నాటిన చెట్టువలె ఆ వ్యక్తి ఏపుగా, బలంగా ఉంటాడు. నీటి వనరులున్న చెట్టుకు బలమైన వేర్లుంటాయి. ఆ చెట్టు వేసవి వేడికి తట్టుకుంటుంది. దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి. ఒక సంవత్సరం వర్షాలు కురియకపోయినా దానికీ భయముండదు. ఆ చెట్టు ఎల్లప్పుడు కాయలుకాస్తుంది.

యెషయా ౪౧:౧౦
దిగులుపడకు, నేను నీతో ఉన్నాను. భయపడకు, నేను నీ దేవుణ్ణి. నేను నిన్ను బలంగా చేశాను. నేను నీకు సహాయం చేస్తాను. నేను మంచితనపు కుడిహస్తంతో నిన్ను బలపరుస్తాను.

జాన్ ౧:౧౬
ఆయన పరిపూర్ణత వల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము.

ఆదికాండము ౨౨:౧౬-౧౭
[౧౬] యెహోవా దూత చెప్పాడు: “నా కోసం నీ కుమారుణ్ణి చంపడానికి నీవు సిద్ధపడ్డావు. అతడు నీకు ఒక్కడే కుమారుడు. నా కోసం నీవు ఇలా చేశావు గనుక నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను. యెహోవానైన నేను వాగ్దానం చేసేది ఏమిటంటే[౧౭] నిజంగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఆకాశంలో అసంఖ్యాక నక్షత్రాలులాగా సముద్ర తీరంలో ఇసుకలాగా నీ సంతానమును చేస్తాను. నీ ప్రజలు వారి శత్రువులనందరినీ ఓడిస్తారు.

ఆదికాండము ౨౭:౨౮-౨౯
[౨౮] విస్తారమైన పంటలు, ద్రాక్షారసం నీకు ఉండేటట్టు వర్షాలు యెహోవా నీకు సమృద్ధిగా ఇచ్చుగాక.[౨౯] మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక, జనములు నీకు సాగిలపడుదురు గాక, నీ సోదరుల మీద నీవు పరిపాలన చేస్తావు నీ తల్లియొక్క కుమారులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు, నిన్ను శపించే ప్రతీ వ్యక్తి శపించబడుతాడు, నిన్ను ఆశీర్వదించే ప్రతి వ్యక్తీ ఆశీర్వదించబడుతాడు.”

కీర్తనలు ౧:౧-౩
[౧] 1ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే, అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు, అతడు పాపులవలె జీవించనప్పుడు, దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.[౨] ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు. ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.[౩] కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు. సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు. అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు. అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.

కీర్తనలు ౨౩:౧-౪
[౧] యెహోవా నా కాపరి నాకు కొరత ఉండదు[౨] పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు. ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.[౩] ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు. ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.[౪] చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.

౨ సమూయేలు ౨౨:౩-౪
[౩] [This verse may not be a part of this translation][౪] యెహోవా స్తుతింపబడుగాక! ఆదుకొమ్మని యెహోవాను వేడుకున్నాను దేవుడు నా శత్రువుల బారి నుండి నన్ను రక్షించును!

౧ జాన్ ౫:౧౮
దేవుని బిడ్డగా జన్మించిన వాడు పాపం చెయ్యడని మనకు తెలుసు. తన బిడ్డగా జన్మించిన వాణ్ణి దేవుడు కాపాడుతాడు. సైతాను అతణ్ణి తాకలేడు.

కీర్తనలు ౧౩౮:౭
దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బతికించుము. నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.

౨ కోరింతియన్స్ ౯:౮
అప్పుడు దేవుడు మీకవసరమున్న దాని కన్నా ఎక్కువే యిస్తాడు, మీకు అవసరమున్నవన్నీ అన్ని వేళలా మీకు లభించేటట్లు చెయ్యటమే కాకుండా సత్కార్యాలు చెయ్యటానికి కావలిసినవి సమృద్ధిగా యిస్తాడు.

ఫిలిప్పీయులకు ౪:౭
దేవుడు యిచ్చే శాంతిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అది మీ హృదయాలను, మీ బుద్ధిని, యేసు క్రీస్తులో ఉంచి కాపలాకాస్తుంది.

Telugu Bible WBTC
Copyright WBTC