A A A A A

అదనపు: [సమృద్ధి]


౧ తిమోతి ౫:౮
తన స్వంతవారిని ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడలేని వాడు మనం నమ్మే సత్యాలను విడిచి అవిశ్వాసి అయిన వానితో సమానం. అతడు దేవుణ్ణి నమ్మని వానికన్నా అధ్వాన్నం.

౨ కోరింతియన్స్ ౯:౮
అప్పుడు దేవుడు మీకవసరమున్న దాని కన్నా ఎక్కువే యిస్తాడు, మీకు అవసరమున్నవన్నీ అన్ని వేళలా మీకు లభించేటట్లు చెయ్యటమే కాకుండా సత్కార్యాలు చెయ్యటానికి కావలిసినవి సమృద్ధిగా యిస్తాడు.

ద్వితీయోపదేశకాండము ౨౯:౧౨
మీరంతా మీ దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక చేసు కొనేం దుకు ఇక్కడ ఉన్నారు. యెహోవా నేడు మీతో ఈ ఒడంబడిక చేస్తున్నాడు.

ఎఫెసీయులకు ౩:౨౦
దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తిద్వారా సంభవిస్తోంది.

ఎక్సోడస్ ౩౪:౬
మోషే ఎదుట యెహోవా దాటి వెళ్తూ ఇలా అన్నాడు: “యెహోవా దయ, జాలిగల దేవుడు. యెహోవా త్వరగా కోపపడడు. యెహోవా మహా ప్రేమపూర్ణుడు. యెహోవా నమ్ముకోదగినవాడు.

జేమ్స్ ౧:౧౭
ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్టమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు.

జాన్ ౧౦:౧౦
దొంగ దొంగతనం చేయటానికి, చంపటానికి, నాశనం చేయటానికి వస్తాడు. నేను వాళ్ళకు క్రొత్త జీవితం ఇవ్వాలని వచ్చాను. ఆ క్రొత్త జీవితం సంపూర్ణమైనది.

ల్యూక్ ౬:౩౮
ఇతర్లకు యివ్వండి, మీకివ్వబడుతుంది. అప్పుడు మీకు కొలతలు నింపి, అదిమి, కుదిల్చి ఒలికిపోతుండగా మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో యిస్తే ఆ కొలతతో మీకు లభిస్తుంది.”

ల్యూక్ ౬:౪౫
మంచి వాని హృదయం మంచి గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతని నుండి మంచి తనమే బయటకు వస్తుంది. చెడ్డవాని హృదయం చెడు గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతనినుండి చెడే బయటకు వస్తుంది. మనిషి తన హృదయములో ఉన్న గుణాలను బట్టి మాట్లాడుతాడు.

మాథ్యూ ౬:౩౩
కాని మొదట ఆయన రాజ్యం కొఱకు, నీతి కొఱకు ప్రయాస పడండి; అప్పుడు అవన్నీ దేవుడు మీకిస్తాడు. 34రేపటిని గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. ఏరోజుకు తగ్గ కష్టాలు ఆరోజుకు ఉన్నాయి.

ఫిలిప్పీయులకు ౪:౧౯
నా దేవుడు యేసు క్రీస్తులో ఉన్న గొప్ప ఐశ్వర్యంతో మీ అవసరాలన్నీ తీరుస్తాడు.

సామెతలు ౩:౫-౧౦
[౫] పూర్తిగా యెహోవాను నమ్ముకో! నీ స్వంత తెలివి మీద ఆధారపడవద్దు.[౬] నీవు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు.[౭] నీ స్వంత జ్ఞానం మీద ఆధార పడవద్దు. కాని యెహోవాను గౌరవించి, దుర్మార్గానికి దూరంగా ఉండు.[౮] నీవు ఇలా చేస్తే, అప్పుడు నీ శరీరానికి మంచి ఆరోగ్యమునూ నీ ఎముకలకు సత్తువా కలుగుతుంది.[౯] నీ ఆరోగ్యంతో యెహోవాను ఘనపరచు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆయనకు ఇమ్ము.[౧౦] అప్పుడు నీకు కావలసినవి అన్నీ నీకు ఉంటాయి. నీ కొట్టాలు ధాన్యంతో నిండి ఉంటాయి, నీ పీపాల్లో ద్రాక్షారసం పొర్లుతూ ఉంటుంది.

కీర్తనలు ౨౩:౫
యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాక భోజనం సిద్ధం చేశావు. నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు. నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.

కీర్తనలు ౩౬:౮
యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు. అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని తాగనిస్తావు.

కీర్తనలు ౩౭:౧౧
దీనులు భూమిని జయిస్తారు, వాళ్లు శాంతిని అనుభవిస్తారు.

కీర్తనలు ౬౫:౧౧
కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు. బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.

కీర్తనలు ౭౨:౧౬
పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక. కొండలు పంటలతో నిండిపోవునుగాక. పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక. పొలాలు గడ్డితో నిండి పోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక.

రోమన్లు ౧౫:౧౩
రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.

కీర్తనలు ౬౬:౮-౧౨
[౮] ప్రజలారా మా దేవుని స్తుతించండి. స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.[౯] దేవుడు మాకు ఆ జీవాన్ని ఇచ్చాడు. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.[౧౦] దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.[౧౧] దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు. భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.[౧౨] మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు. అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు. కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.

Telugu Bible WBTC
Copyright WBTC